Оберіть трек для відтворення

జననీ జననీ
జననీ వరదాయనీ త్రిలోచని నీ పద దాసిని కావగదే
జననీ
పతి ఎడబాటే సైపగలేక
పతి ఎడబాటే సైపగలేక పశుపతిలోన సగమైనావే
పశుపతిలోన సగమైనావే
కాంతుని చూపే కరవైపోయే
కాంతుని చూపే కరవైపోయిన
దీనను దయగన రాదా
జననీ వరదాయనీ త్రిలోచని నీ పద దాసిని కావగదే
జననీ
నా పతి ఏ గతి తాపసియై
నా పతి ఏ గతి తాపసియై
ఘోరాటవిలో కృశియించేనో
ఘోరాటవిలో కృశియించేనో
తపమును వేగమె సఫలము జేయవే
తపమును వేగమె సఫలము జేసీ
విజయము ఈయవె దేవీ
జననీ వరదాయనీ త్రిలోచని నీ పద దాసిని కావగదే
జననీ
జననీ