Оберіть трек для відтворення
ఏం చేసావో నా మనసు నీదైపోయింది
ఏదేమైనా నిను వదలి రానని అంటుంది
ఏం చేసావో నా ప్రాణం నీ చుట్టే ఉంది
ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది
నిను చేరి జతగా ఆడానా సరదాల కేళి
ఇక చూడు రోజూ అయిపోదా సరసాల హోలీ
నీ ఆలనలో నీ లాలనలో
ఇక నాకన్నా మహరాణి వేరే ఉందా
ఏం చేసావో నా మనసు నీదైపోయింది
ఏదేమైనా నిను వదలి రానని అంటుంది
ఏం చేసావో నా ప్రాణం నీ చుట్టే ఉంది
ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది
పాపాయల్లె నా ముందు కుదురుగ కూర్చుంటే
పుత్తడిబొమ్మగ నిను దిద్ది దిష్టే తియ్యనా
పిల్లాడల్లె అల్లరిగా పరుగులు తీస్తుంటే
కళ్ళను మూసి నలుగెట్టి లాలలు పోయనా
నువ్ నడిచి అలిసిపోతుంటే అర చేతుల నిను మోసేను
నువ్ కధలు చెప్పమని అంటేNమన కధనే వినిపిస్తాను
ఏ చింతా లేదంటా నీ చెంతనుంటే
ఏ భాగ్యం కావాలి నాకింతకంటే
ఈ దొరసాని, నా అలివేణి
ఇక లోకంలో ఏదైనా పోతేపోనీ
ఏం చేసావో నా ప్రాణం
ఏదేమైనా జీవితమే
స్వాతీ చినుకుల మూత్యాలే దోసిలిలో నింపి
మురిపెము తీర నీపైన ముద్దుగ జల్లనా
చిరుమేఘంలొ ఏడేడు రంగులనే తెచ్చి
మరునిమిషంలో నీ చేయి గాజులు చేయనా
కనురెప్పలాగ నేవుంటే కనుపాపై నిదరోతాను
మునిమాపువేళ చలివేస్తే నిను అల్లుకుపోతా నేను
అమవాసలు లేవంటా నీవెదుట ఉంటే
అమ్మల్లే తినిపిస్తా అలిగినావంటే
ఓ స్నేహితుడా నా సహచరుడా
ఇక నూరేళ్లు నువ్వే నా తోడూ నీడా
ఏం చేసావో నా మనసు నీదైపోయింది
ఏదేమైనా నిను వదలి రానని అంటుంది
ఏం చేసావో నా ప్రాణం నీ చుట్టే ఉంది
ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది
నిను చేరి జతగా ఆడానా సరదాల కేళి
ఇక చూడు రోజూ అయిపోదా సరసాల హోలీ
నీ ఆలనలో నీ లాలనలో
ఇక నాకన్నా మహరాణి వేరే ఉందా