Оберіть трек для відтворення
పరిమళించు వెన్నెలలే నేడు
తరుణి రూపు దాల్చే
సొగసులొలుకు మధుమాసంలోనా
మగువ తీరు దోచే
మగువ తీరు దోచే
పరిమళించు వెన్నెలలే నేడు
తరుణి రూపు దాల్చే
సొగసులొలుకు మధుమాసంలోనా
మగువ తీరు దోచే
మగువ తీరు దోచే
వికచ కమల సౌందర్యంలోనా
వెలది మోము విరిసే
రమ్య మధన సుమ బాణంలాగా
రమణి చూపు మెరిసే
వికచ కమల సౌందర్యంలోనా
వెలది మోము విరిసే
రమ్య మధన సుమ బాణంలాగా
రమణి చూపు మెరిసే
అ రమణి చూపు మెరిసే
పరిమళించు వెన్నెలలే నేడు
తరుణి రూపు దాల్చే
సొగసులొలుకు మధుమాసంలోనా
మగువ తీరు దోచే
మగువ తీరు దోచే
మరులు గొలుపు మధు కలసములాగా
తరుణి పెదవి దోచే
మరులు గొలుపు మధు కలసములాగా
తరుణి పెదవి దోచే
కడలి తరగ నురుగులలో నేడు
పడతి నోము పూచే
పడతి నవ్వు పూచే
పరిమళించు వెన్నెలలే నేడు
తరుణి రూపు దాల్చే
సొగసులొలుకు మధుమాసంలోనా
మగువ తీరు దోచే
మగువ తీరు దోచే
లలిత మృదుల పల్లవమును పోలి
నెలత సిగ్గు నిలిచే
పాల రాతి శిల్పముకే ఇపుడు
ప్రాణ కళలు వచ్చే
లలిత మృదుల పల్లవమును పోలి
నెలత సిగ్గు నిలిచే
పాల రాతి శిల్పముకే ఇపుడు
ప్రాణ కళలు వచ్చే
ప్రాణ కళలు వచ్చే
పరిమళించు వెన్నెలలే నేడు
తరుణి రూపు దాల్చే
సొగసులొలుకు మధుమాసంలోనా
మగువ తీరు దోచే
మగువ తీరు దోచే