Оберіть трек для відтворення
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
పువ్వుల ఎదలో శబ్దం
మన మనసులు చేసే యుద్ధం
ఇక ఒప్పదే నా హృదయం
ఒప్పదే నా హృదయం
సత్యమసత్యము పక్కపక్కనే
ఉంటాయి పక్కపక్కనే
చూపుకి రెండు ఒకటే
బొమ్మ బొరుసులు పక్కపక్కనే
చూసే కళ్ళు ఒకటే
అయినా రెండు వేరేలే
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
రేయిని మలిచి
కనుపాపలుగా చేశావో
కనుపాపలుగా చేశావో
చిలిపి వెన్నెలతో
కన్నులు చేశావో
మెరిసే చుక్కల్ని తెచ్చి
వేలి గోళ్ళుగా మలిచి
మెరుపుల తీగను తెచ్చి
పాపిటిగా మలిచావో
వేసవి గాలులు పీల్చి
వికసించే పువ్వులు తెచ్చి
మంచి గంధాలేన్నో పూసి
మేను మలిచావో
అయినా మగువా
మనసుని శిలగా చేసినావే
వలచి మగువా
మనసుని శిలగా చేసినావే
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పేయి నేస్తం
కలకాలం బ్రతికేస్తా
వయసుని తడిమి
నిదుర లేపింది నీవేగా
నిదుర లేపింది నీవేగా
వలపు మధురిమలు తెలిపింది నీవేగా
ఓ గాలి నేల నింగి
ప్రేమ ప్రేమించే మనసు
వివరము తెలిపినదేవరో
ఓ ప్రేమ నీవేగా
గంగై పొంగే మనసు
కవితల్నే పాడుతూ ఉంటే
తుంటరి జలపాతమ్లా
కమ్ముకున్నది నీవేగా
అయినా ప్రియుడా
మనసుకి మాత్రం దూరమైనావే
కరుణే లేక
మనసుని మాత్రం వీడిపోయావే
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పేయి నేస్తం
కలకాలం బ్రతికేస్తా
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా
పువ్వుల ఎదలో శబ్దం
మన మనసులు చేసే యుద్ధం
ఇక ఒప్పదు నా హృదయం
ఒప్పదు నా హృదయం