Оберіть трек для відтворення
పరాశక్తి పైడితల్లి పాహి పాహి జనని
విజయనగరపుర వాసిని విజయదుర్గ జయహే
ఆది శక్తి అంశమున అవతరించే అపార శక్తి
అదిగో శ్రీ పైడితల్లి ఉత్తరాంధ్ర కల్పవల్లి
జై పైడిమాంబ జై జై పైడిమాంబ
కోటి సూర్య కాంతులతో విరాజిల్లు రాజేశ్వరీ
కలి కల్మషహారిణి కరుణామృత వర్షిణి
శ్రీ మాతే మహారాజ్ఞి మరకతమణి విభూషణి
రత్న ఖచిత సింహాసని శ్రీ చక్ర సంచారిణి
జై పైడిమాంబ జై జై పైడిమాంబ
దుష్ట శక్తి సంహారిణి ఖడ్గ చక్ర ధారిణి
భక్తకోటులను బ్రోచే బంగరు మా పైడితల్లి
సకలజనుల క్షేమంకరి వేప వృక్ష ప్రియంకరి
నట గాయక వైతాళిక జనగణమన ఘన పూజితే
జై పైడిమాంబ జై జై పైడిమాంబ
జగమేలే జగదీశ్వరి నమో త్రిపుర సుందరి
సిరిమానుత్సవ రూపిణి శుభమంగళ దాయిని