Сингл / Трек
నిన్ను చూడగానే నా గుండె జారిందే
ఉన్న ఒక్క ప్రాణం నీ చుట్టూ తిరిగిందే
నిన్ను చూడగానే ఈ కాలం ఆగిందే
ఉన్నట్టుండి లోకం అందంగా మారిందే
ఒక నవ్వే కదా ఒక చూపే కదా
ఇన్ని చిత్రాలు ఏంటో ఇలా
నువ్వేలే నా శ్వాస
నువ్వేలే నా ధ్యాస
నీతో కలిసి బ్రతకాలన్నది నాదో చిన్న ఆశ
నీలో నన్ను చూసా
నాలో నిన్ను మోసా
ఔనన్నా నువ్వు కాదన్న నా మనసే నీకిచ్చేసా
పూట పూట గుర్తొస్తున్నావే
నీటి మీద నడిపిస్తున్నావే
కాటుక కళ్ళతోటి చంపేస్తున్నావే
నూటికినూరుపాళ్లు నాచేస్తున్నావే
ఈ జన్మ నీతోనే మరు జన్మ నీతోనే
వచ్చి వచ్చి గుండెల్లోన వాలిపోవే గువ్వలా(గువ్వలా, గువ్వలా)
నువ్వేలే నా ఆట
నువ్వేలే నా పాట
నువ్వుంటేనే నా సంతోషాన్ని వెయ్యలేను కాటా
నువ్వే ఉన్న చోట కాదా పూల తోట
హృదయం మొత్తం రాసిచ్చేస్తా నాకేంవొద్దు వాటా
ఆగి ఆగి నువ్వే చూస్తుంటే
గుండె ఆగి ఆగి కొట్టుకుంటోందే
గాజులు ఘల్లుమని చప్పుడు చేస్తుంటే
గాయత్రి మంత్రమేదో వినిపిస్తూ ఉందే
ఈ హాయి నీవల్లే ఈ మాయ నీవల్లే
నీలో నేను కలిసి పూత గాలిలోనే తేమల్లె (తేమల్లె, తేమల్లె)
తిండి నిదర లేక రాసా ప్రేమలేఖ
ఎంతందంగా వేసేసావే మనసులోన టిక
వంద ఏళ్ళ దాకా నేనే నీకు తోక
నువ్వుంటేనే నా life-u ఇంక లేనేలేదు డోఖా