Оберіть трек для відтворення

తొలి సూర్యుడా నెల బాలుడా
కనువిందుగా వెలుగొందరా
జనమందరి చిరునవ్వుగా
జగమేలరా జయమందరా
ఎదగరా పుడమి మెరిసే
కలగా అమ్మ కలగా
నీ ప్రతోక అడుగు
కథగా నిలిచిపోగా
నీ చలనమెపుడు
గెలిచే కిరణమవదా
నా దీవనెపుడు
నీతో పయనమవదా
నేనన్న ఉనికే నీ కొరకూ
నీ మంచి కొరకే కడ వరకూ
నిజమెరుగను నిధురెరుగను
అను క్షణమిక నీ తలపే
పలు రకముల రుచులడగను
తేనెల సిరి నీ పిలుపే
నిను పొందిన ప్రియ వరమున
ప్రతి సుఖమొక దిగ దుడుపే
నా పంచ ప్రాణాలు ఆకృతినే నువ్వు
శతకోటి దైవాల బహుమతినే నువ్వు
పెను కష్టం తొలగించే
చిరు కొనవేలు నువ్వు
అదృష్టం కలిగించే అమ్మకు నాన్నవు
నీ క్షేమమే ఆకాంక్షరా
అనురాగమే ఆసిస్సురా
తొలి సూర్యుడా నెల బాలుడా
కనువిందుగా వెలుగొందరా
ఎదగరా పుడమి మెరిసే
కలగా అమ్మ కలగా
నీ ప్రతో క అడుగు
కథగా నిలిచిపోగా
నీ చలనమెపుడు
గెలిచే కిరణమవదా
నా దీవనెపుడు
నీతో పయనమవదా
నేనన్న ఉనికే నీ కొరకూ
నీ మంచి కొరకే కడ వరకూ
నేనన్న ఉనికే నీ కొరకూ
నీ మంచి కొరకే కడ వరకూ