Оберіть трек для відтворення
ఎగిరి పోవే రామ చిలక ఆడపిల్లవి కాదు గనక
అబలవని అరిటాకువనిమెత్తని మాటల మాయతో ఆపవు నిను ఏనాడు కనిపించని పంజరాలు
ఎగిరి పోవే రామ చిలక ఆడపిల్లవి కాదు గనక
హేహేహే తందానా
హేహేహే థిల్లానా
తననం తననం తననం తన
ఆడదానివని ఆపలేరు కదా సెలయేటిని ఎవరు
అణిగుండమని చెరలేదు కదా చిరుగాలినికి ఎపుడూ ఆ
చిన్ని గువ్వా మబ్బుల్ని తాకగలవు
మల్లె పూవ మనసారా నవ్వగలవు మీకు లేవే పరదాలు
అడగు అడుగునా ఆ ఆడ జన్మకి ఎన్నెన్నో పంజరాలు
ఎగిరి పోవే రామ చిలక ఆడపిల్లవి కాదు గనక
తనననానాన తనననానాన తనననానాన తనననానాన
పిల్లగా చెల్లిగా ఆలిగా తల్లిగా ఎన్ని పదవులు ఉన్నా
ఆదిశక్తివని సృష్టి మూలమని ఎన్ని బిరుదులు ఉన్నా
బతుకంతా బంగారు పంజరాలు విడిపోని నూరేళ్ల బంధనాలు
అనుబంధపు సంకెళలో అలలను సైతం కట్టి పడేసే ఎన్నెన్నో పంజరాలు
ఎగిరి పోవే ఏ రామ చిలక ఆడపిల్లవి కాదు గనుక
అబలవని అరిటాకువని మెత్తని మాటల మాయతో ఆపవు నిను ఏనాడు కనిపించని పంజరాలు
ఎగిరి పోవే ఏ రామ చిలక ఆడపిల్లవి కాదు గనుక