Оберіть трек для відтворення
జగములనేలే పరిపాలక
జగతికి నీవే ఆధారమ
ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము
ప్రేమగీతము యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్య
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్య
మహరాజుగా నా తోడువై నిలిచావు
ప్రతిస్థలమున నా భారము నీవు మోయగా
సుళువాయే నా పయనము
నీ దయచేతనే కలిగిన క్షేమము
ఎన్నడు నను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు
తరగని సౌభాగ్యమే
సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును
నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను
ఘనులకు లేదే ఈ శుభతరుణం నాకిది నీ భాగ్యమా
జీవితమంతా నీకర్పించి నీ రుణము తీర్చనా
పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే నా యాత్రలో
నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే
నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా
నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెద