Оберіть трек для відтворення
నిదురించే గుండెలా
నినదించే కోయిలా
ఎదనూపేవు ఎలా
నువ్వే నా నేస్తమా
నువ్వే నా నేస్తమా
అరమూసే కన్నులా
తెర తీసే ఓ కలా
కురిసేటి వెన్నెలా
నువ్వే నా నేస్తమా
నువ్వే నా నేస్తమా
నీ తొలి చూపులే
నా ముని బాపులై
నే వేచేను బ్రతుకంత పడిగాపులై
నీ నిట్టూర్పులే నా ఓదార్పులై
నే వేగేను విరహాలే వడగాడ్పులై
గగనాల తారకా సెగరేపే కోరికా
మది దోచే మల్లికా
నువ్వే నా నేస్తమా
నువ్వే నా నేస్తమా
నీ పద రేణువే
నా ఎద వేణువై
పలికించేను నీ రూపే ఆలాపనై
నీ చిరు కోపమే
నా శిరి దీపమై
వెలిగించేను తొలివలపే ఆరాధనై
రవలించే రాగమా
రగిలించే విరహమా
లాలించే స్నేహమా
నువ్వే నా నేస్తమా
నువ్వే నా నేస్తమా
నిదురించే గుండెలా
నినదించే కోయిలా
ఎదనూపేవు ఎలా
నువ్వే నా నేస్తమా
అరమూసే కన్నులా
తెర తీసే ఓ కలా
కురిసేటి వెన్నెలా
నువ్వే నా నేస్తమా
నువ్వే నా నేస్తమా