Оберіть трек для відтворення
మరీ అంతగా మహా చింతగా
మొహం ముడుచుకోకలా
పనేం తోచక పరేషానుగా
గడబిడ పడకు అలా
మతోయెంతగా శృతే పెంచక
విచారాల విల విలా
సరే చాలిక అలా జాలిగా
తికమక పెడితె ఎలా
పన్నీరై కురవాలా
మన చుట్టూవుండే లోకం తడిసేలా
ముస్తాబే చెదరాలా
నిను చూడాలంటే అద్దం జడిసేలా ఓ
ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే
కష్టం పోతుందా
కదా మరెందుకు గోల
అయ్యయ్యో పాపం అంటే
ఏదో లాభం వస్తుందా
వృధా ప్రయాస పడాల
మరీ అంతగా మహా చింతగా
మొహం ముడుచుకోకలా
సరే చాలిక అలా జాలిగా
తికమక పెడితె ఎలా
ఎండలను దండిస్తామా
వానలను నిందిస్తామా
చలినెటో తరిమేస్తామా చీ పొమ్మనీ
కస్సుమని కలహిస్తామా
ఉస్సురని విలపిస్తామా
రోజులతో రాజీ పడమా సర్లెమ్మనీ
సాటి మనుషులతో మాత్రం
సాగనని ఎందుకు పంతం
పూటకొక పేచీ పడుతూ
ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం
ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే
కష్టం పోతుందా
కదా మరెందుకు గోల
అయ్యయ్యో పాపం అంటే
ఏదో లాభం వస్తుందా
వృధా ప్రయాస పడాల
చమటలేం చిందించాలా
శ్రమపడేం పండించాలా
పెదవిపై చిగురించేలా చిరునవ్వులు
కండలను కరిగించాలా
కొండలను కదిలించాలా
చచ్చిచెడి సాధించాలా సుఖ శాంతులు
మనుషులనిపించే ఋజువు
మమతలను పెంచే ఋతువు
మనసులను తెరిచే హితవు
వందేళ్లయినా వాడని చిరునవ్వు
ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే
కష్టం పోతుందా
కదా మరెందుకు గోల
అయ్యయ్యో పాపం అంటే
ఏదో లాభం వస్తుందా
వృధా ప్రయాస పడాల