Оберіть трек для відтворення
చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా
(చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా)
ఉన్నకాడే ఉండరా గంజి తాగి పండరా
మంచి రోజులొచ్చేదాకా నిమ్మళంగా ఉండరా
(ఉన్నకాడే ఉండరా గంజి తాగి పండరా
మంచి రోజులొచ్చేదాకా నిమ్మళంగా ఉండరా)
Cigaretteలు chocolateలు roadలు మీద ముచ్చట్లు
బ్రతికుంటె చూసుకుందాం ఇప్పుడైతే బందుపెట్టు
ప్రజలందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నయిరా
బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా
(ప్రజలందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నయిరా
బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా)
యుధ్ధానికి సిద్ధమా? రోగం తరిమేద్దమా?
ఆయుధాలు లేవురా హృదయముంటే చాలురా
(యుధ్ధానికి సిద్ధమా? రోగం తరిమేద్దమా?
ఆయుధాలు లేవురా హృదయముంటే చాలురా)
కష్టాలు ఉండబోవు కలకాలం సోదరా
కాలం మారేదాకా ఓపిక్కొంత పట్టరా
నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం
పగలనక రాత్రనక సైనికులై సాగినారు
(నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం
పగలనక రాత్రనక సైనికులై సాగినారు)
ప్రాణాలే పణం పెట్టి మన కోసం పోరుతుంటే
బాధ్యత లేకుండా మనం వారికి బరువవుదామా?
(ప్రాణాలే పణం పెట్టి మన కోసం పోరుతుంటే
బాధ్యత లేకుండా మనం వారికి బరువవుదామా?)
లోకమంటే వేరు కాదు నువ్వే ఆ ఆలోకం రా
నీ బతుకు చల్లగుంటే లోకానికి చలువరా