Оберіть трек для відтворення
పల్లవి
పాపాత్ముల కెక్కడ దీ కాలము పారమార్ధికము వేణు
గోపాలా దోవగాచి దొంగలు - గొట్టరా సన్యాసుల నైన
అనుపల్లవి
కులకాంతల వ్రతము భంగము జేతురు -
బలిపీఠము గొట్టేమని లేతురు
పిలువనంపి నెత్తిన పదివేతురు
పులిదాసళ్లకు బెట్టిన కతగా
చరణం
శంకించక పనులు వరగ దోతురు
శంబర మాయలు కల్పన జేతురు
జంకక లంచానికి చెయి సాతురు
రంకు మొగుడు కడుపు నొప్పి జూచునా
॥పాపాత్ము
చరణం
పెద్దల సొమ్మపహరింప జూతురు -
సద్దులేక యడిగితె తలయూతురు
రద్ది జేసి రచ్చలోకి దీతురు
యెద్దు పుండు కాకికి ముద్దైనా
॥పాపాత్ము!
చరణం
తప్పు లేని దండగ దెమ్మందురు -
తమ ప్రజ్ఞలు తామె పొగడుకొందురు
అప్పటముగా సొంట్లు వెతకు చుందురు -
కుప్పులు కాలిచి పేలాలు తినే
||పాపాత్ము|
చరణం
ఇరుగు పొరుగు వారిని వేధింతురు -
యెగరవేసి మాట్లాడి జయింతురు
వురగమువలెనే పగ సాధింతురు
గురువుకు పంగనామము బెట్టే
॥పాపాత్ము|