Оберіть трек для відтворення
ఏదేమైనా సఖీ విడువను నిన్నే
ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నా
ఏలే సూర్యుని మీన జాబిలి మీన
ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే
ఒక పాపగ నిన్నే
కను పాపగ నిన్నే
కాచుకొందుకై బాసలు సేయుచుంటినే
జ్ఞాపకమే రారిక కన్నవారైనా
కలనైనా తలవను ఏ కన్నెనైనా
చిట్టి గొలుసు చప్పుళ్లకి
చెంతకు రానా
గుట్టుకి ఒక ముద్దునొసగి
బానిస కానా
నువ్వడిగే ఏ వరమైనా భారము కాదే
మన నడుమున ఏ వాదమైనా
ఓటమి నాదే
ఏదేమైనా సఖీ విడువను నిన్నే
ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నా
ఏలే సూర్యుని మీన జాబిలి మీన
ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే
ఆశ తీరినాక ప్రేమ ఆపుకోనే
అర్ధరాత్రి దొంగై నీకు బెదురుతానే
నువ్వు ముసలివైన మూడవ కాలవుతా
కలతకుంటే నా ఒడినే పానుపు చేస్తా
ఊపిరిగ నిన్ను చేరి ఆయువు పోస్తా
నీ వారిని నా వారిగ ఎదలో దాస్తా
నీ కల నిజమవడానికి నను బదులిస్తా
నీ క్షేమం కోసమయితే ప్రాణాలిస్తా
ఏదేమైనా సఖీ విడువను నిన్నే
ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే
ఏలే సూర్యుని మీన జాబిలి మీన
ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే
ఒక పాపగ నిన్నే
కను పాపగ నిన్నే
కాచుకొందుకై బాసలు సేయుచుంటినే
కాచుకొందుకై బాసలు సేయుచుంటినే
కాచుకొందుకై బాసలు సేయుచుంటినే