Оберіть трек для відтворення
మొదలౌదాం తొలిప్రేమగా
అపుడో ఇపుడో ఎప్పుడైతేనేం కొత్తగా
జతపడదాం ఒక జన్మగా
మనలో ఎవరెవరో మరుపైపోయే కలయికగా
ఏ నిమిషం నిను చూశానో ఒక చూపులో ప్రేమలో పడిపోయా
కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా
ఏ నిమిషం నిను చూశానో ఒక చూపులో ప్రేమలో పడిపోయా
రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా
ఆకలుండదే నా నువ్వే కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే పూలబాణంేస్తుంటే
ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే
ఓ నేను నేను కానులే
నువ్వు నువ్వు కావులే
మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలిందే ప్రేమే
ఆకలుండదే నా నిన్నే కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే పూలబాణంేస్తుంటే
ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే
నువ్వొచ్చి చేరగా
అదేంటో కానీ నాలో నాకు
కొంచెం కూడా చోటు లేదుగా
నా మనస్సుపై నీ పేరు వాలగా
మచ్చుకైనా మాటకైనా నాకు నేను గుర్తుకైనా రానుగా
మనకు లేనెలేవుగా కల నిజం రెండుగా
ప్రతి జ్ఞాపకం అవదా అనగా అనగా కథగా
ఆకలుండదే నా నిన్నే కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే పూలబాణంేస్తుంటే
ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే
ఈ చిన్ని గుండెలో నీ పైన ఉన్న ప్రేమను అంతా
ఏ రూపంగా దాచనే చెలీ
ఒక్క మాటలో రెండక్షరాలలో
పెంచుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనులే మరీ
ఇద్దరొక్కటన్నదీ ఈ ప్రేమ వారధీ
వందేళ్ల బాటలో ప్రేమే మనకు అతిథి
ఆకలుండదే నా నిన్నే కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే పూలబాణంేస్తుంటే
ఓ ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే