Оберіть трек для відтворення

సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో
చెప్పేదెవరు ఏ కంటికైనా
రెప్పల దుప్పటి కప్పే చీకటి
చూపించేనా ఏ కాంతినైనా
నిను నీవే సరిగా కనలేవే మనసా
నడి రాతిరి నడకా
కడతేరదు తెలుసా
ఏవో జ్ఞాపకాల సుడిదాటి
బైట పడలేవా
ఎన్నో తీపి సంగతుల
రేపు పిలుపు వినలేవా
చంద్రుడి ఎదలో మంటని
వెన్నెల అనుకుంటారని
నిజమైనా నమ్మేస్తామా
భ్రమలో పడమా తెలిసీ
జాబిలిని వెలివేస్తామా
తనతో చెలిమే విడిచి
రూపం లేదు గనక
సాక్ష్యాలు అడిగి ఎవరైనా
ప్రాణం ఉనికి పైన
అనుమానపడరు ఎపుడైనా
నిను నీవే సరిగా కనలేవే మనసా
నడి రాతిరి నడకా
కడతేరదు తెలుసా
పోయింది వెతికే వేదనా
ఉంటుంది ఏదో పోల్చునా
సంద్రంలో ఎగిసే అలకి
అలజడి నిలిచేదెపుడో
సందేహం కలిగే మదికి
కలతను తీర్చేదెవరో
శాపంలాగ వెంట పడుతున్న
గతం ఏదైనా
దీపంలాగ తగిన దారేదో చూపగలిగేనా