Оберіть трек для відтворення
Сингл / Трек
ఎర్రెర్ర బొట్టు దిద్ది వెండి మేఘం
మెరిసిందే మెరిసిందే
పచ్చాని చీరకట్టి పంట చేనే
మురిసిందే మురిసిందే
పరదాలే తీసేద్దాం దిగిదిగిదిత్తాం
దిత్తాం దిత్తాం
ఏ మబ్బు వెనకా
ఏ సినుకు ఉందో ఏడా రాలునో
ఏ తొవ్వలోనా ఏ మలుపు ఉందో
ఏడాగునో సాగునో
ఏ ఎండల్లో దాగి ఏడు రంగుల్లో
ఆ హరివిల్లే పుట్టెను కదా
ముల్లైనా పూలైనా కొమ్మకు పూసె కదా
గిర గిర గిర గింగిరాగిరే
సర సర సర బొంగరాలివే
జర జర జర సుట్టు తిరిగిలే
అందాల భూమి సూర్యడిలా
గిర గిర గిర గింగిరాగిరే
తుర్రు తుర్రు తుర్రు తోకపిట్టలే
జర జర జర ఎగిరి పోవులే
రయ్యంటూ రాయే వడిసెల్లా
ఎర్రెర్ర బొట్టు దిద్ది వెండి మేఘం
మెరిసిందే మెరిసిందే
పచ్చాని చీరకట్టి పంట చేనే
మురిసిందే మురిసిందే
పరదాలే తీసేద్దాం దిగిదిగిదిత్తాం
దిత్తాం దిత్తాం
పల్లే తల్లిలా కొంగునే సాపినాదే
ఒళ్లో గువ్వలా దాచినాదే
ఊరే స్నేహమే ఊరిన ఊట సెలిమాయే
చుట్టూ పక్కా ఏ గోడలు
అడ్డే లేని ఈ వాడలు
ముద్దుగున్నాయే హత్తుకున్నాయే
మనసుతోనే అందరూ సొంతమనే
గిర గిర గిర గింగిరాగిరే
సర సర సర బొంగరాలివే
జర జర జర సుట్టు తిరిగిలే
అందాల భూమి సూర్యడిలా
గిర గిర గిర గింగిరాగిరే
తుర్రు తుర్రు తుర్రు తోకపిట్టలే
జర జర జర ఎగిరి పోవులే
రయ్యంటూ రాయే వడిసెల్లా
రాలే సుక్కలే గాజులా సప్పుడాయే
లేనీ హాయిలో ముంచినాయే
దూరం చూడగా దారిలో దగ్గరైపోయే
చల్లారనీ సంతోషమే తెల్లారంగా ఉండాలని
పంచుకున్నాయే పెంచుకున్నాయే
తెల్వకనే తెలిసిన చుట్టంలా
గిర గిర గిర గింగిరాగిరే
సర సర సర బొంగరాలివే
జర జర జర చుట్టు తిరిగిలే
అందాల భూమి సూర్యడిలా
గిర గిర గిర గింగిరాగిరే
తుర్రు తుర్రు తుర్రు తోకపిట్టలే
జర జర జర ఎగిరిపోవులే
రయ్యంటూ రాయే వడిసెల్లా