Оберіть трек для відтворення
ఉన్నమాట చెప్పనీవు
ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగే సత్యభామ
నన్నుదాటి వెళ్లలేవు
నిన్ను నువ్వు దాచలేవు
ఏమి చెయ్యనయ్యోరామ
అనుకున్నా తప్పు కదా
మోమాటం ముప్పు కదా
మనసైతే ఉంది కదా
మన మాటేం వినదు కదా
పంతం మానుకో భయం దేనికో
ఉన్నమాట చెప్పనీవు
ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగే సత్యభామ
నన్ను దాటి వెళ్లలేవు
నిన్ను నువ్వు దాచలేవు
ఏమి చెయ్యనయ్యోరామ
వద్దన్నకొద్ది తుంటరిగా
తిరగకలా నా వెనక
నిద్దర్లో కూడా ఒంటరిగా వదలవుగా
నన్నాశపెట్టి ఈ సరదా
నేర్పినదే నువ్ గనక
నా కొంగుపట్టి నడవనిదే కుదరదుగా
అడుగడుగున ఎదురైతే
ఏ దారి తోచదుగా
అటు ఇటు ఎటు తేల్చవుగా
మన కథ నువ్ తొందరగా
ప్రతీచోట నీ నవ్వే పిలుస్తోందిగా
నన్నుదాటి వెళ్లలేవు
నిన్ను నువ్వు దాచలేవు
ఏమి చెయ్యనయ్యోరామ
ఉన్నమాట చెప్పనీవు
ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగే సత్యభామ
అమాయకంగా చూడకలా వేడుకలా చిలిపికల
అయోమయంగా వెయ్యకలా హాయివల
నీమీదకొచ్చి ఉరితాడై వాలదుగా వాలుజడ
దానొంక చూసి ఎందుకట గుండెదడ
మరి మరి శృతిమించి ఇలా
నను మైమరపించకలా
తడబడి తలవంచి ఇలా
తలపును అణిచేస్తే ఎలా
మరేం చెయ్యనే నీతో
ఎలా వేగనే
నన్ను దాటి వెళ్లలేవు
నిన్ను నువ్వు దాచలేవు
ఏమి చెయ్యనయ్యోరామ
ఉన్నమాట చెప్పనీవు
ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగే సత్యభామ
అనుకున్నా తప్పు కదా
మోమాటం ముప్పు కదా
మనసైతే ఉంది కదా
మన మాటేం వినదు కదా
పంతం మానుకో
భయం దేనికో
ఉన్నమాట చెప్పనీవు
ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగే సత్యభామ
నన్ను దాటి వెళ్లలేవు
నిన్ను నువ్వు దాచలేవు
ఏమి చెయ్యనయ్యోరామ