
Сингл / Трек
తొలకరి చినుకుల నను తడిపేసిన
మనసున నిండెనే నీపై నా ప్రేమా
తెలియని భావమా అలజడి భావ్యమా
తొలి అనురాగమా ఆపే హంగామా
అరమరికలు మెరుపుల మరకలు చాలింకా
చెలి వలపుల పిలుపులు ఇక విను గోరింకా
పదపదమని హృదయము తరిమెను నీ వంక
చిరునగవుల వెలుగుల తరగల నెలవంక
సరసకు వచ్చానిలా సరసము తెచ్చానిలా
సర్వము నీకింక ఇచ్చేస్తున్నా
ముదై ముద్దర వేయనా
సరిహద్దులు రద్దే చేయనా
హద్దు పద్దు లేదని
నిను ముద్దే చేయనా
నీ చుట్టూనే జీవితం
బిగి కౌగిట్లోనే కాపురం
గుట్టు మట్టు నీదని
ఇక ఒట్టే వేయనా
ప్రతి నిముషం నీ పరవశమై
గాలిలో తేలనా
మరునిమిషం నీకై వశమై
ఒళ్ళో వాలనా
నిను వలచి నిను తలచి నిను గెలిచి సాగనా
ఇరుమనసుల కలిసిక ఒకటిగా మారేలే
మన కలయిక మమతకు కదలిక అయ్యేలే
కలలను పొమ్మంటున్నా నిజమై రమ్మంటున్నా
నిన్నిక నాలోన నింపేస్తున్నా
సరసకు చేరగా (చేరగా)
సరిగమ పాడగా (పాడగా)
కురిసెను ధారగా మనలో ఈ ప్రేమ
తలపులు హాయిగా తలుపులు తీయగా
వలపులు వాలగా తడిపే ఈ ప్రేమా