Оберіть трек для відтворення
ఆశ చిన్ని ఆశ నన్ను చూసి మాయగా
శ్వాస కొత్త శ్వాస నన్ను చేరే హాయిగా
నేను నడిచే దారిలో నాకు దొరికే తోడుగా
నేను వెతికే ఊహలో నన్ను నడిపే నావగా
ఎదురే చేరి ప్రేమించగా
ఆశ చిన్ని ఆశ నన్ను చూసి మాయగా
శ్వాస కొత్త శ్వాస నన్ను చేరే హాయిగా
గతంలోన కథల్లోన చూడని పథంలోన పతంగాల ఆమని
నన్ను చూసి నాతో ఆడేనా
వనం లోని విహంగాల సారిక ఇలా నన్ను వెతుక్కుంటు వాలగ
జంట చేరి నాతో పాడేనా
వేల వేల ఆశల్లోన సూర్యోదయం
కోటి కోటి తారల్లోన చంద్రోదయం
హరివిల్లులో కొత్త రంగునై చేరనా
ఆశ చిన్ని ఆశ నన్ను చూసి మాయగా
శ్వాస కొత్త శ్వాస నన్ను చేరే హాయిగా
వయ్యారాల వసంతాల వాకిట స్వరంలోన పదాలల్లి పాడగ
మేఘమాల నేనై సాగేనా
పదారేళ్ళ పసందైన కోరిక పదా అంటూ పిలుస్తున్న వేడుక
పారిజాత పువ్వై పూసేనా
గాలి నీరు నేలా నింగి దీవించగా
అంతులేని ఆనందాలే లోగిళ్ళుగా
తొలి వేకువై కొత్త లోకమే చూడనా
ఆశ చిన్ని ఆశనన్ను చూసి మాయగా
లాలలాలలాలలాలలాల హాయిగా