Оберіть трек для відтворення
కల కనులకు నేరం
నిదురకు ఇక దూరం
నడవదు క్షణ కాలం
కలవరం మొదలై
వరముగ నీ స్నేహం
అడిగెను మది పాపం
తన మనుగడ కోసం బదులిడు చెలివై
ఓ తారకా
నా కోరిక కాదనకే
కళ్ళాలతో అల్లాడదా నా వలపే
చేజారిపోతే నే రాలిపోతా
నువ్వు కాదన్న రోజే శ్వాసాగిపోదా
నీ పాదాలు మోసే భారాన్ని నాకిచ్చెయ్వే వయ్యారి
చేజారిపోతే నే రాలిపోతా
నువ్వు కాదన్న రోజే శ్వాసాగిపోదా
నీ పాదాలు మోసే భారాన్ని నాకిచ్చెయ్వే వయ్యారి
నడిచేటి దారుల్లో పడిగాపై చేరెదెవా
నడిరేయి భయమేస్తే నా నీడై ఉంటావా
వెన్నెలింటిలో మిన్నునడిగి అతిధులుగా అడుగేద్దాం
చందమామనే కథలడిగి నిదరోయి నవ్వేద్దాం
నీతో నేను
నాతో నువ్వు
కాలం తీరిపోయినా ప్రేమే ఆవిరవ్వునా
నువు నా దేహం
నే నీ ప్రాణం
ప్రేమే పల్లవించదా
పదమే పులకరించదా
చేజారిపోతే నే రాలిపోతా
నువ్వు కాదన్న రోజే శ్వాసాగిపోదా
నా పాదాలు మోసే భారాన్ని నీకిచ్చెయ్నా, వచ్చెయ్వా
చేజారిపోతే నే రాలిపోతా
నువ్వు కాదన్న రోజే శ్వాసాగిపోదా
నా పాదాలు మోసే భారాన్ని నీకిచ్చెయ్నా, వచ్చెయ్వా
చేజారిపోతే నే రాలిపోతా
నువ్వు కాదన్న రోజే శ్వాసాగిపోదా
నీ పాదాలు మోసే భారాన్ని నాకిచ్చెయ్వా, వచ్చెయ్వా
చేజారిపోతే నే రాలిపోతా
నువ్వు కాదన్న రోజే శ్వాసాగిపోదా
నా పాదాలు మోసే భారాన్ని నీకిచ్చెయ్నా, వచ్చెయ్వా